Nandikotkur: నందికొట్కూరు 17వ వార్డు టీడీపీ అభ్యర్థి దేశెట్టి సరిత జోరుగా ప్రచారం!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి దేశెట్టి సరిత దూకుడుగా ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.
Nandikotkur: నందికొట్కూరు 17వ వార్డు టీడీపీ అభ్యర్థి దేశెట్టి సరిత జోరుగా ప్రచారం!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో 17వ వార్డు టీడీపీ పార్టీ అభ్యర్థిని దేశెట్టి సరిత తన దైన శైలిలో దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి టీడీపీ పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈమె, వార్డు కౌన్సిలర్ స్థానానికి సైతం శక్తివంతన లేకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుండటం విశేషం.
స్వతహాగా కుండబద్దలు కొట్టే మనస్తత్వం కలిగిన దేశెట్టి సరిత తన ప్రత్యర్థి అభ్యర్థి కన్నా ప్రచారంలో ముందు ఉంది. వార్డులోని ప్రజలందరికీ సుపరిచితురాలు కావడం ఈమెకు కలిసొచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు.
వార్డులోని ప్రతి గడపకు వెళ్ళి తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది.మన గుర్తు సైకిల్ అంటూ ప్రతి ఒక్కరిని తనవైపుకు తిప్పుకునేలా చేశారు.
నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి సైతం ఈమె ప్రచార తీరును మెచ్చుకోవడం చూస్తే ఈమెటీడీపీ పార్టీ తరుపున 17వ వార్డు కౌన్సిలర్ గా తనదైన ముద్ర వేయడానికి అడుగు దూరంలో ఉంది అనడం అతిశయోక్తి కాదు.
తనను గెలిపిస్తే వార్డు లోని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని, తాగు నీటి సౌకర్యం కల్పిస్తానని అలాగే ప్రతి సందులో సిమెంట్ రోడ్డును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. 17వ వార్డు అభ్యర్థి సరితకు ఇదే వార్డులో అధిక శాతం తమ శ్రేయస్సును కోరుకునే వారు ఉండటం స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటం చెయ్యడం ఈమెకు అదనపు నల్లని ఇస్తుంది.
దేశెట్టి సరిత ప్రచారంలో ఈమెకు తోడునీడగా ఈమె భర్త దేశెట్టి శ్రీనివాసులు మంచి తోడ్పాటును, సహకారాన్ని అందిస్తున్నారు.
తమ కూటమి పార్టీ అధికారంలో ఉంటూ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పథకాలు రాని వారికి హామీని ఇస్తూ ప్రచారం దూసుకు వెళుతున్నారు.
ప్రచారం ఈమెకు ప్రచారంలో సహకారం అందిస్తున్న జల్లు పద్మావతి,దేశెట్టి హారిక,దేశెట్టి లక్ష్మీనారాయణ ,జల్లు ఆంజనేయులు, దేశెట్టి ఆదిత్య. మరియు దేశెట్టి వరుణ్ లకు ధన్యవాదాలు తెలిపారు.




