Nandyal: నంద్యాల మున్సిపల్ పోరులో టీడీపీ తొలి అభ్యర్థి ప్రకటన!

Nandyal: నంద్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో టీడీపీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. 50వ వార్డు అభ్యర్థిగా తాతిరెడ్డి రేణుకారెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.

R Pavankalyan, Nandyal
Published on: 18 Oct 2026 9:07 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాల మున్సిపల్ పోరులో టీడీపీ తొలి అభ్యర్థి ప్రకటన!

Nandyal: నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో తొలి అడుగు వేసింది.. నంద్యాల నియోజకవర్గంలో 50వ వార్డు అభ్యర్థిగా తాతిరెడ్డి రేణుకారెడ్డి పేరును ఖరారు చేసింది.. పార్టీ అభ్యర్థిగా రేణుకారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.. కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల బరిలోకి దిగుతామని ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు.

నంద్యాల మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి మొదలైంది.. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.. ఈ నేపథ్యంలో నంద్యాల 50వ వార్డుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాతిరెడ్డి రేణుకారెడ్డి పేరును ఖరారు చేసింది.

పార్టీ అభ్యర్థిగా రేణుకారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.. నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ నాయకత్వంలో తన కుమార్తెకు అభ్యర్థిత్వం ఖరారు కావడం సంతోషంగా ఉందని ఆమె తండ్రి తాతిరెడ్డి జయరామిరెడ్డి తెలిపారు.

ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలంతా విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని జయరామిరెడ్డి పిలుపునిచ్చారు.. 50వ వార్డులో రేణుకారెడ్డి విజయానికి పార్టీ శ్రేణులంతా కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తమ కుటుంబం భాగస్వామిగా ఉందని తాతిరెడ్డి కుటుంబ సభ్యుడు హేమేశ్ రెడ్డి పేర్కొన్నారు.. తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని తెలిపారు.

భారీ మెజారిటీపై రేణుకారెడ్డి ధీమా!

50వ వార్డు ప్రజలకు అభివృద్ధి, ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ అభ్యర్థి తాతిరెడ్డి రేణుకారెడ్డి తెలిపారు.. కూటమి నాయకులతో కలిసి సమష్టిగా ఎన్నికల్లో ముందుకు సాగుతామని చెప్పారు.. 50వ వార్డులో భారీ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్‌తో పాటు పార్టీ నాయకత్వానికి విజయాన్ని కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తంగా.. నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తొలి అభ్యర్థి ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది.. 50వ వార్డులో తాతిరెడ్డి రేణుకారెడ్డి విజయం కోసం పార్టీ శ్రేణులు ఏ మేరకు సమష్టిగా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal