Alur: ఆలూరు జడ్పీటీసీగా పెట్రోల్ బంక్ కిషోర్ నామినేషన్

Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆశీస్సులతో పెట్రోల్ బంక్ కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు.

Bheemalinga, Aluru
Published on: 22 Oct 2026 6:40 PM IST
Alur
X

Alur: ఆలూరు జడ్పీటీసీగా పెట్రోల్ బంక్ కిషోర్ నామినేషన్

కర్నూలు జిల్లా: ఆలూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్రోల్ బంక్ కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆశీస్సులతో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ కిషోర్ మాట్లాడుతూ.. “ఆలూరు మండల ప్రజలే నన్ను ఆదరించి, ఆశీర్వదించాలి. ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. ఆలూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

“మీ అమూల్యమైన ఓటు అభివృద్ధికి పునాది. ఆలూరు మండల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మనమంతా ఒక్కటిగా ముందడుగు వేద్దాం. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నాను” అని పెట్రోల్ బంక్ కిషోర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru