Srisailam: సుండిపెంట తొలి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవానికి కృషి చేయాలి
Srisailam: సుండిపెంటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చొరవతో ఏకగ్రీవానికి సహకరించాలని సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ విజ్ఞప్తి.
Srisailam: సుండిపెంట తొలి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవానికి కృషి చేయాలి
శ్రీశైలం: శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సున్నిపెంట గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. సున్నిపెంటలో మొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నందుకు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే నీ సున్నిపెంటను గ్రామపంచాయతీగా ప్రకటించడంలో చూపిన ప్రత్యేక చొరవను కొనియాడుతున్నారు. డ్యామ్ కట్టిన రోజు నుంచి ఈరోజు వరకు సున్నిపెంట గ్రామ ప్రజలందరూ కుల మతాలకతీతంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు.
సున్నిపెంటలో మొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరింత చొరవ తీసుకొని సున్నిపెంట పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించే ముందు అన్ని యూనియన్లతో మాట్లాడి ఏకగ్రీవానికి సహకరించాలని శ్రీశైలం మండల సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు G.V .నారాయణ మరియు కార్యవర్గ సభ్యులు కోరుచున్నారు.




