Markapur: మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

Markapur: మార్కాపురం జిల్లా దరిమడుగు ఎస్సీ పాలెంలో రహదారి లేక విద్యార్థుల అవస్థలు. మురికి నీటిలోనే నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న వైనం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 Sept 2026 12:16 PM IST
Markapur
X

Markapur: మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

Markapur: మార్కాపురం జిల్లా దరిమడుగు ఎస్సీ పాలెం నుంచి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు ప్రతిరోజూ మురికి నీటిలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటిలో నడవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ పాలెం నుంచి పాఠశాల వరకు రహదారి ఏర్పాటు చేయాలని విద్యార్థులు, స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM