Markapuram: మార్కాపురం గ్రామీణ సమస్యలపై SRM MBA విద్యార్థుల అధ్యయనం!
Markapuram: మార్కాపురం జిల్లా గ్రామీణ సమస్యలపై SRM యూనివర్సిటీ-AP పారి స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 35 మంది MBA విద్యార్థులు SARDS సహకారంతో క్షేత్రస్థాయి అధ్యయనం చేశారు.
Markapuram: మార్కాపురం గ్రామీణ సమస్యలపై SRM MBA విద్యార్థుల అధ్యయనం!
మార్కాపురం జిల్లా: SRM యూనివర్సిటీ-AP పరిధిలోని పారి స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన సుమారు 35 మంది MBA విద్యార్థులు, SARDS సంస్థ సహకారంతో నవంబర్ 12, 13 తేదీల్లో మార్కాపురం జిల్లాలో రెండు రోజుల పాటు గ్రామీణ క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించారు.
పెద్దారవీడు మండలం తొక్కపల్లి, యర్రగొండపాలెం మండలంలోని గురజపల్లి, వీరభద్రాపురం, అల్లిపాలెం గ్రామాలను సందర్శించి గ్రామీణ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేశారు.
వెలుగొండ నిర్వాసిత కుటుంబాల జీవన పరిస్థితులు, వలసలు – జీవనోపాధిపై ప్రభావం, చెంచు గిరిజనుల్లో బాల్యవివాహాల సమస్య, వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.
క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని విద్యార్థుల ప్రాజెక్టులకు, భవిష్యత్తులో SARDS చేపట్టే గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు వినియోగించనున్నారు.
సామాజిక సమస్యలపై ప్రత్యక్ష అవగాహనతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పారి స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన SARDS సంస్థకు, గ్రామీణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.




