Srisailam: శ్రీశైలం దేవస్థానం హుండీ లెక్కింపు: భారీగా కానుకలు
Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాల్లో 29 రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.4.56 కోట్ల నగదు, బంగారం, వెండి కానుకలు లభించాయి.
Srisailam: శ్రీశైలం దేవస్థానం హుండీ లెక్కింపు: భారీగా కానుకలు
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,హుండీ లెక్కింపు నిర్వహించారు అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 56 లక్షల 49 వేల 063 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 79 గ్రాముల 600 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 3 కేజీల 760 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 823,యూఏఈ దిర్హమ్స్ 515,సింగపూర్ డాలర్లు 93,ఆస్ట్రేలియా డాలర్లు 50,కెనడా డాలర్లు 45, ఇంగ్లాండ్ పౌండ్స్ 10,సౌదీ రియాల్స్ 20, కువైట్ దినార్లు 5, ఒమాన్ రియాల్స్ 5, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు,ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.




