Srisailam: చెంచు రైతన్నలకు పనిముట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
Srisailam: శ్రీశైలంలో చెంచు గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రైతులకు పనిముట్లు, పట్టాలు అందజేశారు.
Srisailam: చెంచు రైతన్నలకు పనిముట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
శ్రీశైలం: ఆదివాసి చెంచు గిరిజన జాతి నల్లమలలు అంతరించిపోయే ప్రమాదకర స్థాయిలో ఉన్నారని వారిని సంరక్షించుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని మధ్య నల్లమల అడవి భూముల్లో ఉద్యాన పంటల సాగు చేసే గిరిజన చెంచు రైతులకు ఎమ్మెల్యే ఐటిడిఏ ద్వారా పనిముట్లను అందజేశారు.
నల్లమల చెంచు గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఏర్పాటుచేసిన శ్రీశైలం ఐటీడీఏ ఈరోజు చెంచులను ఆదుకొని వారి హక్కులను పరిరక్షిస్తుందని గిరిజనులు కూడా అభివృద్ధివైపు పయనించాలని పిలుపునిచ్చారు శ్రీశైలం ఎమ్మెల్యే. మొదటినుంచి బుడ్డా కుటుంబానికి చెంచులంటె ప్రత్యేక ప్రేమ ఆదరణఅని తన తండ్రి బుడ్డా వెంగళరెడ్డి హయం నుంచి వారిపై వున్నా ప్రేమాభిమానాలను ఎమ్మెల్యే ఈ సందర్బంగా జ్ఞప్తిచేసుకున్నారు.
ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖతో ఒప్పించి నల్లమల చెంచులకు విద్య, వైద్యం, పక్కా గృహాలు , రహదారులు, సంక్షేమానికి కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులను విడుదల చేస్తు .. మన మూలపురుషులైన ఆదివాసి చెంచు గిరిజనులు మనుగడకు పాటుపడుతున్నాని, తెలుగుదేశం ప్రభుత్వం వక్కటే నల్లమల చెంచుల సంక్షేమానికి కట్టుపడిందని అని ఎమ్మెల్యే చెపుతూ యూవగళం పాదయాత్రలో లోకేష్ బాబు ఆత్మకూరు నల్లమల మీదుగా పాదయాత్ర చేస్తూ బండి ఆత్మకూరులో చెంచులకు ఇచ్చిన హామీమేరకు పక్క గృహాలు మంజూరు చేసారని మాటకు కట్టుబడి చెంచులకిచ్చిన హామీలను నెరవేర్చమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రోజురోజుకు అంతరిస్తున్న ఆదివాసీ నల్లమల చెంచుజాతిని ప్రతి ఒక్కరూ సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు.
వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న సాగు భూములకు అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్ర రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను చెంచు రైతులకు ఎమ్మెల్యే, శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి అందజేశారు.




