Srisailam: శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

Srisailam: భారీ వర్షాలకు శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 24 Sept 2026 11:16 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం సమీపంలోని హైదరాబాద్ ఘాట్ రోడ్డులో కొండ చరియ బండరాళ్లు విరిగిపడ్డాయి గత రెండు రోజుల నుండి శ్రీశైలం మండలంలో భారీ వర్షం పడుతుంది.

ఈనేపథ్యంలో వర్షానికి డ్యామ్ సమీపంలో ఒక్కసారిగా పెద్ద కొండ చరియల బండరాళ్లు విరిగి స్వల్పంగా రోడ్డుపై అడ్డంగా పడ్డాయి దీనితో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అయితే కొండ చరియల బండరాళ్లు విరిగిపడిన సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది పొరపాటున కొండ చరియలు విరిగిపడ్డ సందర్భంలో కారు,బస్సు,లారీలు ఏదైనా ఉండి ఉంటే ప్రాణ నష్టం వాటిల్లేది కొండ చరియల ధాటికి వాహనం నుజ్జు నుజ్జు అయివుండేది అయితే జలాశయం సమీపంలో తరచూ వానలు పడినప్పుడు కొండ చరియల బండరాళ్లు పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM