Srisailam: శ్రీశైలంలో నిత్యకళారాధన.. హరికథ, కూచిపూడి నృత్య ప్రదర్శన

Srisailam: శ్రీశైలం దక్షిణ మాడవీధి నిత్యకళారాధన వేదికపై గుడిపాటి జయరామ సుధాకర్ హరికథ, కాకినాడ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 20 Nov 2026 9:51 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో నిత్యకళారాధన.. హరికథ, కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైలం: శ్రీశైలం కళారాధన గుడిపాటి జయరామ సుధాకర్, విజయవాడ వారిచే హరికథ కార్యక్రమంఏర్పాటుచేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథ కార్యక్రమం నిర్వహించారు. తరువాత రెండవ కార్యక్రమము కూచిపూడి కోలాటం నృత్యాలయం, కాకినాడ వారిచే కూచిపూడి నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో మూషికవాహన, శివతాండవం, శంభో..శివశంభో తదితర గీతాలకు, అష్టకాలకు మోక్షిత, లాస్య, లక్ష్మీ, పల్లవి, త్రివేది, తదితరులు నృత్యప్రదర్శన చేశారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM