Srisailam: శ్రీశైలంలో వైభవంగా కోటి దీపోత్సవం.. దశవిధ హారతులు

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాల సందర్భంగా కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది; కైలాస పర్వత నమూనా వేదికపై ప్రత్యేక పూజలు, దశవిధ హారతులు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 20 Nov 2026 9:25 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో వైభవంగా కోటి దీపోత్సవం.. దశవిధ హారతులు

శ్రీశైలం: కార్తీకమాసోత్సవాలసందర్భంగాదేవస్థానం కోటిదీపోత్సవాన్ని నిర్వహించారు దేవస్థాన ఆగమ పాఠశాల ముందుభాగంలో గల మైదానంవద్దసాయంత్రం 6.00 గంటలకునుండిఈకోటిదీపోత్సవం జరిపించబడతాయి ఇందుకోసం కైలాస పర్వత నమూనాలో ప్రత్యేక వేదిక కూడా సిద్ధం చేయడం జరిగింది. కాగా ఈ దీపోత్సవానికి కావలసిన పూజాద్రవ్యాలనన్నింటినీ దేవస్థానమే సమకూరుస్తుంది.

ముందుగా ఈ రోజు సాయంత్రం గం.4.30లకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. దీవి హయాగ్రీవాచార్యుల వారిచే కోటిదీపోత్సవ విశేషాలు వివరించబడుతాయి. అనంతరం సాంప్రదాయ నృత్యం కార్యక్రమం నిర్వహించబడ్డాయి. తరువాత కోటిదీపోత్సవప్రత్యేక వేదికపైనుంచిశ్రీస్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులకు విశేషపూజలు, కోటిదీపోత్సవం జపించబడతాయి అనంతరం స్వామిఅమ్మవార్లకుదశవిధహారతులుగా ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించారు.

దశవిధ హారతుల తరువాత ప్రఖ్యాత సినీనేపథ్యగాయకులు మనో గారి బృందంచే భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు. చివరగా మంత్రపుష్పం, తీర్థప్రసాదవితరణ, ఆశీర్వచనంతో కోటిదీపోత్సవ కార్యక్రమం ముగించబడుతుంది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యం కల్పించారు దీపజ్యోతిని యజ్ఞాగ్నికి సంకేతంగా చెప్పడం మన సంప్రదాయమన్నారు. అందుకే సంప్రదాయబద్దంగా ఈ కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యంగా కోటిదీపోత్సవాన్నినిర్వహించారు.

అనంతరంకార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్ఞానం, వెలుగు, ఉత్సాహం, ఆనందం, శాంతి మొదలైనవాటికి దీపాన్ని ప్రతీకగా భావిస్తారన్నారు. దీపారాధన వలన ఈ దివ్యగుణాలను పొందవచ్చునని పండితులు పేర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్లకు దీపజ్యోతిని సమర్పించడం వలన సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది.

కాగా వైదిక సంప్రదాయంలో పరమేశ్వరునికి దీపజ్యోతిని సమర్పించడం వలన సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.దశవిధహారతులు దర్శనఫలాలు పరబ్రహ్మస్వరూపమైనబీజాక్షరమే ఓంకారం ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి. సకల శుభాలు కలుగుతాయి. నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది.

త్రిశూలహారతి త్రిశూలహారతిని దర్శించడం వలన అపమృత్యువు అంటే అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నిర్వహించారు. నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది. సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది.

చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి, ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతిని దర్శించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూరహారతిని దర్శించడం వలనపాపాలన్నీతొలగిపోతాయి. యజ్ఞఫలంతోపాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM