Srisailam: 420 మంది చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

Srisailam: నెలలో చివరి బుధవారం సందర్భంగా 420 మంది చెంచు గిరిజన భక్తులకు ఉచిత స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనం కల్పించి అన్నప్రసాదాలు అందించిన దేవస్థానం.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 25 Nov 2026 8:07 PM IST
Srisailam
X

Srisailam: 420 మంది చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైలం: దేవస్థానం ప్రతీ నెలలో చివరి బుధవారం రోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా 420 మందికి చెంచు గిరిజన భక్తులకు శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం మరియు అమ్మవారి దర్శనం కల్పించబడింది. స్థానిక చెంచుగూడెములతో పాటు పలు చెంచు గూడెముల చెంచు గిరిజనులు స్పర్శదర్శనాన్ని చేసుకోవడం జరిగింది.

దర్శనానంతరం చెంచు గిరిజన భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాగా ఈ రోజు ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. వారికి ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ తాము పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెములను సందర్శించానన్నారు. ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు. తదనుగుణంగా గత సంవత్సరం చెంచుభక్తులకు నెలలో ఒకరోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశములో తీర్మానించడం జరిగిందన్నారు.

గత డిసెంబరు 30వ తేదీ నుంచి ఈ ఉచిత స్పర్శదర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకోవడం జరిగిందన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM