Srisailam: మల్లన్న సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ

Srisailam: శ్రీశైలంలో ఘనంగా సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వి రమణ పర్యటన. మల్లన్నకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన. ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 25 Sept 2026 5:13 PM IST
Srisailam
X

Srisailam: మల్లన్న సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ

శ్రీశైలం: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు, అర్చకులు సాధర స్వాగతం పలికారు.

అనంతరం శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలు,చిత్రపటాలని శ్రీశైలం స్థల పురాణం చరిత్రకు సంబంధించిన శ్రీశైలం దేవస్థానం ప్రచురించిన కాపీ టేబుల్ పుస్తకాన్ని చైర్మన్, ఈవో అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM