Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి వైభవంగా దసరా మహోత్సవాలు ప్రారంభం!
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి అక్టోబర్ 20 వరకు వైభవంగా దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజు భ్రమరాంబాదేవి శైలపుత్రీ అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి వైభవంగా దసరా మహోత్సవాలు ప్రారంభం!
Srisailam: శ్రీశైల ఆలయం దసరా మహోత్సవాలకు ముస్తాబైంది విద్యుత్ దీప కాంతులతో శ్రీశైలం క్షేత్రం దసరా మహోత్సవాల శోభను సంతరించుకుంది నేటి నుంచి 20వ తేది వరకు పది రోజులపాటు శ్రీశైలం మహాక్షేత్రంలో దసర మహోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో భక్తులకు సఖల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు.
భ్రమరాంబాదేవి అమ్మవార్లు రోజుకోక్క అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుండగా స్వామిఅమ్మవార్లు ప్రతిరోజు సాయంత్రం వాహనసేవలో భక్తులకు కనువిందు చేయనున్నారు.
ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దసర మహోత్సవాలకు ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు శ్రీకారం చుట్టనున్నారు సాయంత్రం మొదటిరోజు శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీ స్వామిఅమ్మవార్లు బృంగి వాహనసేవలో ప్రత్యేక పూజలందుకుని శ్రీశైలం పురవీధులలో కన్నులపండువగా గ్రామోత్సవంలో విహారించనున్నారు.




