Srisailam: శ్రీశైలంలో ఘనంగా దసరా పూర్ణాహుతి, తెప్పోత్సవం

Srisailam: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు చండీ, రుద్రయాగ పూర్ణాహుతి మరియు పుష్కరిణిలో తెప్పోత్సవంతో అత్యంత వైభవోపేతంగా ముగిశాయి.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 20 Oct 2026 8:33 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ఘనంగా దసరా పూర్ణాహుతి, తెప్పోత్సవం

నంద్యాల జిల్లా: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, శ్రీస్వామివారి యాగశాలలో రుద్రయాగ పూర్ణాహుతి అర్చకులు,వేదపండితులు నిర్వహించారు.

అనంతరం కలశోద్వాసన కార్యక్రమం జరిపించి పూర్ణాహుతిలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాస రావు దంపతులు,ట్రస్టు బోర్డ్ సభ్యులు సమర్పించారు. తరువాత మల్లికాగుండం వద్ద చండీశ్వరస్వామికి అవబృథ స్నానం నిర్వహించారు.

ఈ కార్యక్రమములో ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు,ట్రస్ట్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబికాదేవి నిజరూపాలంకరంలో భక్తులకు దర్శనమిస్తూ శ్రీస్వామి అమ్మవారు నందివాహనంపై అధిరోహించి పూజలందుకొని శమీ వృక్షంకు కర్పూర హారతులిస్తారు రాత్రి ఆలయ పుష్కరిలో తెప్పోత్సవం పై శ్రీస్వామి అమ్మవార్ల విహారంతో ఈ ఏడాది దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM