Srisailam: దసరా నవరాత్రులు: స్కందమాత అలంకారంలో భ్రమరాంబికాదేవి!

Srisailam: శ్రీశైలంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు స్కందమాత అలంకారంలో అమ్మవారు, శేష వాహనంపై శ్రీస్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 16 Oct 2026 2:04 PM IST
Srisailam
X

Srisailam: దసరా నవరాత్రులు: స్కందమాత అలంకారంలో భ్రమరాంబికాదేవి!

Srisailam: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు ఐదోవరోజు స్కందమాత అలంకారాంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికా శేష వాహనంపై పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదోవ రోజు భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత

అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు శ్రీ భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు శేష వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు నాదస్వరం,

కేరళ చండీ మేళం, కొమ్ము కోయ నృత్యం,కోలాటం, రాజభటుల వేషాలు,వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,అధికారులు పాల్గొన్నారు...✍️

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM