Srisailam: ఆదరణకు ఆమడదూరంలో రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వంతెన!
Srisailam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే శ్రీశైలం ప్రాజెక్టు దిగువనున్న జాతీయ రహదారి వంతెన శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతులు చేసి కొత్త వంతెన నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
Srisailam: ఆదరణకు ఆమడదూరంలో రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వంతెన!
శ్రీశైలం: ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలజిల్లా శ్రీశైలం మండలం,అటు తెలంగాణ రాష్ట్రం నాగరకర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద లింగలాగట్టు-పాతాళగంగ తెలంగాణ-ఆంద్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు దిగువనున్న జాతీయరహదారి శ్రీశైలం వంతెన రోడ్డు శిథిలావస్థకు చేరుకున్నది. ఈ వంతెననిర్మాణానికిఅప్పటి ప్రదాని జవహర్ లాల్ నెహ్రు1963 జులై23న భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి పీ.వి.నరసింహారావు1972 మే1 న 530 మీటర్ల పొడవు గల వంతెనను ప్రారంభించారు. అదే సమయంలో శ్రీశైలం డ్యామ్ నిర్మాణం కోసం వాహనాలు రాకపోకలకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడింది.
ఈ వంతెనపై 10 టన్నులకు మించి బరువు గల వాహనాలకు అనుమతిలేదని రవాణా శాఖ అధికారులు నిబంధనలు విధించినా వాహనదారులు లెక్కచేయకపోవడంతో వంతెన పరిస్థితి శిథిలావస్థకు చేరుకున్నది అనేది బహిరంగ రహాస్యం. అనునిత్యం వందలాది వాహనాలు రాకపోకలతో వంతెనలో కదలికలు రోడ్డు గుంతలమయంగామారి, పెచ్చులుడుతూ, వంతెనకు ఇరువైపులఉన్న రక్షణ గోడలు అక్కడక్కడ బీటలు బారి పడిపోయిన నేపథ్యం.
100 సంవత్సరాలు ఉపయోగించుకోవలసిన వంతెన 50 సంవత్సరాలకె శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ వంతెనకు ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ హెచ్ ఏ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్రం దోమలపెంట, ఈగలపెంట, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సుండిపెంట, శ్రీశైలదేవస్థానం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో2025 ఆగస్టులో వంతెన భద్రతపై సాంకేతిక తనిఖీలు నిర్వహించి నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ హెచ్ ఏ, అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న ఈ వంతెనకు మరమ్మత్తులు చేయడంతో పాటుగా మరో నూతన వంతెన నిర్మించాలని ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటుగా శ్రీశైలమహాక్షేత్రానికి వచ్చే భక్తులు కోరుతున్నారు.




