Aspari: ములుగుందం గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం!

Aspari: ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ప్రచారం. తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ.

Bheemalinga, Aluru
Published on: 2 Nov 2026 11:05 AM IST
Aspari
X

Aspari: ములుగుందం గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం!

Aspari: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంపీపీ అభ్యర్థి, మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ములుగుందం గ్రామంతో పాటు మరో రెండు గ్రామాల్లో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ములుగుందం ఎంపీటీసీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే, మూడు గ్రామాల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీనివాసులు రెడ్డి హామీ ఇచ్చారు. తాగునీరు, సాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారులు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఖరీఫ్ కు సంబందించిన జూలై 15వ తేదీ నాటికి గ్రామానికి చెందిన వారు రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ చెల్లించారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అయితే, ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదని ఆరోపించారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru