Kurnool: కర్నూలులో ఎస్‌ఆర్ కళాశాల ఇంటర్ విద్యార్థిని అదృశ్యం!

Kurnool: కర్నూలు ఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని శ్వేత అదృశ్యం. ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు. తక్షణమే స్పందించి ఆచూకీ కనుగొనాలని పోలీసులకు డిమాండ్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 2 Nov 2026 8:43 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఎస్‌ఆర్ కళాశాల ఇంటర్ విద్యార్థిని అదృశ్యం!

Kurnool: కర్నూలులోని ఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న శ్వేత అనే విద్యార్థిని కనిపించకుండా పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ కుమార్తె ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థిని శ్వేత అదృశ్యమైన ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఆమె ఆచూకీని వీలైనంత త్వరగా తెలుసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL