Markapur: సచివాలయ ఉద్యోగుల 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతులు లేవు!

Markapur: సచివాలయ ఉద్యోగుల 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 Sept 2026 2:29 PM IST
Markapur
X

Markapur: సచివాలయ ఉద్యోగుల 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతులు లేవు!

Markapur: మార్కాపురం జిల్లా ‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’ కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు మంజూరు కాలేదని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు.

అనుమతులు లేకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనవద్దని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చట్టపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా విజ్ఞప్తి చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM