Ardhaveedu: రెండో విడత నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ మీనా!

Ardhaveedu: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా మంగళవారం అర్ధవీడు మండలంలోని 5 నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 17 Nov 2026 9:55 PM IST
Ardhaveedu
X

Ardhaveedu: రెండో విడత నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ మీనా!

మార్కాపురం జిల్లా, అర్ధవీడు: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని అర్ధవీడు మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు.

మండలంలోని నాగులవరం, మాగుటూరు, రంగాపురం, పెద్దకందుకూరు, అర్ధవీడు గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చేపట్టిన పోలీసు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కంభం సీఐ కే. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU