Markapur: బేస్తవారిపేటలో ఉద్రిక్తత: పిల్లనిచ్చిన మామపై అల్లుడు దాడి!

Markapur: మార్కాపురం జిల్లా బేస్తవారిపేటలో కుటుంబ కలహాల కారణంగా మామపై అల్లుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడిని కంభం ఆసుపత్రికి తరలించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 4 Oct 2026 1:38 PM IST
Markapur
X

Markapur: బేస్తవారిపేటలో ఉద్రిక్తత: పిల్లనిచ్చిన మామపై అల్లుడు దాడి!

Markapur:మార్కాపురం జిల్లా, బెస్తవారిపేట మండల కేంద్రంలో పిల్లనిచ్చిన మామ పై అల్లుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బేస్తవారిపేట కు చెందిన సల్మాన్ ఖాన్, నంద్యాలకు చెందిన జమాల్ భాషాకు తన కూతురిని ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశాడు.

భార్యా భర్తల విభేదాలతో జమల్ భాష భార్య బేస్తవారిపేటలోని తన తండ్రి వద్దనే ఉంటుంది. శనివారం రాత్రి మామ ఇంటికి వచ్చిన జమాల్ భాష భార్యను పంపాలని మామతో వాగ్వాదానికి దిగాడు.

ఆ క్రమంలో మామ పై చేతికి దొరికిన వస్తువుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సల్మాన్ ఖాన్ ను కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU