Srisailam: శ్రీశైలంలో వెయ్యి కలశాల వేడుక.. భక్తిపారవశ్యంలో మునిగిపోయిన శ్రీగిరి!

Srisailam: శ్రీశైలంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకలు ఘనంగా జరిగాయి. 1000 మంది మహిళలతో నిర్వహించిన కలశ శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 11 May 2026 12:13 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో వెయ్యి కలశాల వేడుక.. భక్తిపారవశ్యంలో మునిగిపోయిన శ్రీగిరి!

Srisailam: 1000 కలశాలను ఎత్తుకున్న మహిళలతో ఆలయ గంగాధర మండపం నుండి బయలు వీరభద్ర స్వామి గుడి వరకు కన్నుల పండుగగా శోభాయాత్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమం పునస్కరించుకొని దేవస్థానం విశేష కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా అక్క మహాదేవ అలంకార మండపంలో వెయ్యికి పైగా కలిశారు ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించింది. అనంతరం కలశాలు భక్తులకు అందించి ఆ కళాశాలతో గంగాధర మండపం నందిమండపం మీదుగా బయలు వీరభద్ర స్వామి ఆలయం వరకు మేళ తాళాలతో,వేదమంత్రాలు తో శోభాయాత్ర నిర్వహించారు.

అనంతరం గంగాధర మండపం వద్ద పంచాక్షరి మంత్ర లేఖనం కార్యక్రమం నిర్వహించారు భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగు జాతీయ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమాలు భక్తులు వీక్షించేందుకు దేవస్థానం ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది కళాశాలతో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి కలశంలోని జలాన్ని వృద్ధ మల్లికార్జున స్వామి కి సమర్పించే విధంగా ఏర్పాటు చేసామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం ప్రత్యేకంగా శివ భజనలు, శివ భక్తి గేయాలు ఆలాపన, ఓంకార మంత్ర జపాలు,పేరని శివతాండవ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story