Nandyal: పేరుసోముల శ్రీ విష్ణుగంటి క్షేత్రంలో ఘనంగా చండీ హోమం ప్రారంభం

Nandyal: నంద్యాల జిల్లా సంజమల మండలం పేరుసోముల శ్రీ విష్ణుగంటి క్షేత్రంలో వర్షాలు కురవాలని, కరువు తొలగిపోవాలని కోరుతూ శత చండీ హోమం ఘనంగా ప్రారంభం.

Ramanaiah, Banaganepalle
Updated on: 29 Sept 2026 2:12 PM IST
Nandyal
X

Nandyal: పేరుసోముల శ్రీ విష్ణుగంటి క్షేత్రంలో ఘనంగా చండీ హోమం ప్రారంభం

Nandyal: సంజామల మండలం పేరుసోముల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ విష్ణు కంటి క్షేత్రంలో లోకకళ్యాణార్థం శత చండీ హోమం రాజేష్, అల్లె ప్రభావాతమ్మ రామోహన్ స్వామి వారిచే ఘనంగా ప్రారంభమైంది.

రాయలసీమ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వర్షాలు సమృద్ధిగా కురవాలని మరియు కరువు పరిస్థితులు దూరం కావాలని సంకల్పిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసిన 21 మంది ప్రముఖ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా, వైభవంగా ఈ శత చండీ హోమం జరగనుంది. దేశం,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా విలసిల్లాలనే సదుద్దేశంతోనే ఈ హోమాన్ని చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు రామ్మోహన్ స్వామి వెల్లడించారు. కార్యక్రమం లో వెంకట్ రెడ్డి రాయచోటి భీమిరెడ్డి రిటైర్డ్ ఇంజనీర్ కర్నూలు భక్తులు పాల్గొన్నారు

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle