Kodumuru: కోడుమూరు అభివృద్ధే నా లక్ష్యం. స్వతంత్ర అభ్యర్థి కీలక హామీలు!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి బోయ బలరాం ఇంటింటికీ తిరుగుతూ ఒంటరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

C. Ganesh, Kodumuru
Published on: 24 Nov 2026 11:41 AM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరు అభివృద్ధే నా లక్ష్యం. స్వతంత్ర అభ్యర్థి కీలక హామీలు!

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి బోయ బలరాం తన గెలుపు కోసం ఒంటరిగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ తనకు ఒక్క అవకాశం కల్పించాలని, తనను ఓ బిడ్డగా భావించి ఆశీర్వదించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కోడుమూరు ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా వెనుకాడబోనని, ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

అదేవిధంగా కోడుమూరులో డబుల్ డివైడర్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వంతో పోరాడతానని, ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతగా పేర్కొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru