Kurnool: ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాలలో 'సంకల్ప్' మెటీరియల్ పంపిణీ!
Kurnool: కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘సంకల్ప్’ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్.
Kurnool: ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాలలో 'సంకల్ప్' మెటీరియల్ పంపిణీ!
Kurnool: విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని మరింత పెంపొందించే లక్ష్యంతో ‘సంకల్ప్’ స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
వృత్తి విద్యార్థులకు జీఎఫ్‌సీ (జనరల్ ఫౌండేషన్ కోర్స్) కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో, అలాగే ఇంగ్లీష్‌కు సంబంధించిన అధ్యయన సామగ్రిని ప్రభుత్వం అందిస్తోంది. విద్యార్థుల్లో ప్రాథమిక జ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం మరియు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
కమిషనర్ డా. రంజిత్ బాషా మరియు ఆర్‌జేడీ డా. సి. సురేష్ బాబు ఆదేశాలు, సూచనల మేరకు ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాల, బి.క్యాంప్, కర్నూలులో ప్రభుత్వంచే అందిన ‘సంకల్ప్’ స్టడీ మెటీరియల్‌ను ప్రథమ సంవత్సరం వృత్తి విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ పి.ఓ. డా. ఎస్. నాగస్వామి నాయక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, వృత్తి విద్యార్థులు కేవలం విద్యా విషయాలకే పరిమితం కాకుండా ప్రస్తుత ఉద్యోగ అవకాశాలకు అవసరమైన వివిధ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
‘సంకల్ప్’ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య మరియు భవిష్యత్ కెరీర్‌కు ఉపయోగపడే విధంగా రూపొందించబడిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
కళాశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థులకు అవసరమైన విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించేందుకు కళాశాల యాజమాన్యం కృషి చేస్తోందని తెలిపారు.




