Markapuram: సమస్యల పరిష్కారమే విద్యుత్ అదాలత్ లక్ష్యం: జడ్జి విక్టర్ ఇమ్మానుయేల్
Markapuram: విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారమే విద్యుత్ అదాలత్ లక్ష్యమని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి విక్టర్ ఇమ్మానుయేల్ అన్నారు.
Markapuram: సమస్యల పరిష్కారమే విద్యుత్ అదాలత్ లక్ష్యం: జడ్జి విక్టర్ ఇమ్మానుయేల్
మార్కాపురం జిల్లా: పొదిలి లో నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యాక్రమానికి ఆయన హాజరై విద్యుత్ వినియెగదారులనుంచి ఫిర్యాదులు స్వికరించారు. విద్యుత్ శాఖలో ప్రజలకు సమస్యలు పరిష్కారం గాక ఇబ్బంది పడుతున్న వినియెగదారుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయ సహాయం అందజేస్తున్నామని ఆయన తెలిపారు.
దూర ప్రాంతాలనుంచి వినియెగదారులు రాలేక, సమస్యలు పరిష్కారం కాక, ఇబ్బంది పడుతున్న వారికొసం వారికి అందుబాటులో డివిజన్ స్థాయిలో అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలందరు ఈ అవకాశాన్ని ఉపయెగించుకొవాలని కొరారు, విద్యుత్ బిల్లులు ఎక్కువరావడం,లొఓల్టేజ్ సమస్య ఇంకా పరిష్కారం కాని సమస్యలకు అదాలత్ లో పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి విద్యుత్ అధికారులు,లైన్ మెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




