Devanakonda: కుల, ఆదాయ ధ్రువపత్రాల ఇబ్బందులు..స్మార్ట్‌ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి?

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండలో 'మన మిత్ర' ద్వారా కుల, ఆదాయ ధ్రువపత్రాల సేకరణపై ప్రజల ఇబ్బందులు. మీసేవ సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి.

G Jagadeesh, Pathikonda
Published on: 3 Oct 2026 2:09 PM IST
Devanakonda
X

Devanakonda: కుల, ఆదాయ ధ్రువపత్రాల ఇబ్బందులు..స్మార్ట్‌ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి?

Devanakonda: ప్రభుత్వ సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ‘మన మిత్ర’ ద్వారా కుల, ఆదాయ ధ్రువపత్రాలను పొందే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో

స్మార్ట్‌ఫోన్, వాట్సాప్ సౌకర్యం లేని ప్రజల పరిస్థితిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వృద్ధులు, డిజిటల్ సేవలపై అవగాహన తక్కువగా ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం లా సెట్, పీజీ సెట్ తదితర ప్రవేశ పరీక్షలు, విద్యా అవసరాల కోసం కుల, ఆదాయ ధ్రువపత్రాలు అవసరం కావడంతో విద్యార్థులు సకాలంలో సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మొబైల్ ద్వారా డిజిటల్ కాపీ పొందే అవకాశం ఉన్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ లేని వారు, డిజిటల్ ప్రక్రియపై అవగాహన లేని వారు ధ్రువపత్రాలను ఎలా పొందాలన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఈ నేపథ్యంలో ‘మన మిత్ర’తో పాటు మీసేవ కేంద్రాల్లోనూ కుల, ఆదాయ ధ్రువపత్రాలను ప్రింటెడ్ లేదా ధృవీకృత కాపీ రూపంలో పొందే అవకాశం కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు అనుకూలమైన విధానంలో మన మిత్ర లేదా మీసేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాలు అందుబాటులో ఉంటే స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేని ప్రజలు, విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

డిజిటల్ సేవలను విస్తరిస్తూనే.. డిజిటల్ సౌకర్యాలు లేని ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ సేవలను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda