Kodumuru: ఈ నెల 30న కోడుమూరులో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంపీడీవో రాముడు సూచన.
Kodumuru: ఈ నెల 30న కోడుమూరులో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కోడుమూరు ఎంపీడీవో రాముడు తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా సర్వీస్ ఓటర్లతో పాటు, కోడుమూరు మండల పరిధిలో ఓటరుగా నమోదై ఉండి, MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ విధులకు నియమితులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
కావున, అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో రాముడు కోరారు.




