Markapur: మార్కాపురం జిల్లా కార్యాలయంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Markapur: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరులకు నివాళులర్పించిన కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 Oct 2026 1:47 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లా కార్యాలయంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Markapur: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ పోలీసు గౌరవ వందనం స్వీకరించి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు.

అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి అడ్మిన్ నవజ్యోతి మిశ్రా ఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్ఐలు విశ్వనాథరెడ్డి, వేమనతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM