Adoni: ఆదోనిలో మోదీ బర్త్‌డే: ఆశీర్వాద్ కా దీపం వెలిగించిన టీడీపీ

Adoni: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆదోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 17 Sept 2026 9:17 PM IST
Adoni
X

Adoni: ఆదోనిలో మోదీ బర్త్‌డే: ఆశీర్వాద్ కా దీపం వెలిగించిన టీడీపీ

ఆదోని: మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని “సేవా సంకల్ప అభియాన్ ఆశీర్వాద కా దీపం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ కార్యాలయం లో నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్‌లో దీపాలు వెలిగించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొని దీపాలు వెలిగించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు, ఎక్స్ ఎంపీపీ మురళి, బాబురావు, రామాంజి,దేవేంద్ర, రాఘవరెడ్డి, అబ్దుల్, నరసింహులు, అబ్దుల్ భాష, ఉపేంద్ర, విజయ్ మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL