Alur: ఆలూరు వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పెట్రోల్ బంకు కిశోర్!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న పెట్రోల్ బంకు కిశోర్. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని మండల ప్రజలను కోరారు.
Alur: ఆలూరు వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పెట్రోల్ బంకు కిశోర్!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆలూరు వైస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న పెట్రోల్ బంక్ యజమాని కిశోర్ ప్రజల మద్దతు కోరుతున్నారు. నాకు జడ్పీటీసీ సిటు కల్పించనoదుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి కి కృతజ్ఞతలు తెలిపిన కిశోర్.
ఆలూరు మండల ప్రజలు తనను ఒక్కసారి ఆదరించి, జడ్పీటీసీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు .గతంలో రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని పేర్కొన్న కిశోర్ ఈసారైనా తనను, తన కుటుంబాన్ని ఆదరించాలనీ నన్ను గెలిపించలని ప్రజలను కోరరు . ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.. మీలో ఒకరిగా ఉంటూ, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజల్లోనే ఉంటూ, ఆలూరు మండల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా” అంటూ కిశోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
గత ఎన్నికల్లో విజయానికి చేరువగా వచ్చి ఓటమి పాలైన కిశోర్.. ఈసారి జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల మద్దతును కోరుతున్నారు. మరి పెట్రోల్ బంక్ యజమాని కిశోర్‌కు ఆలూరు మండల ప్రజలు ఈసారి అవకాశం ఇస్తారా? జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? అన్నది వేచి చూడాలి..




