Maddikera: పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు

Maddikera: కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

G Jagadeesh, Pathikonda
Published on: 10 Oct 2026 9:21 PM IST
Maddikera
X

Maddikera: పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు

మద్దికెర: కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో కొలువుదీరిన పురాతన శ్రీ మహావిష్ణు క్షేత్రమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, పుష్పాలంకరణలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ ఉత్సవాల్లో విశేషంగా నిలవనుంది.

ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకునేందుకు కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తిశ్రద్ధలతో జరిగే ఈ పూజా కార్యక్రమాలతో పెరవలి గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.

ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు కోమండూరి రంగనాథాచార్యులు, నరసింహస్వామి, మధుస్వామి పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda