Kurnool: పత్తికొండ నియోజకవర్గంలో వైభవంగా వరుణ యాగం, ప్రత్యేక పూజలు!

Kurnool: కర్నూలు మద్దికెర మండలం పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని కోరుతూ వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్. స్వల్పకాలిక సాగుకు సూచన.

G Jagadeesh, Pathikonda
Published on: 6 Oct 2026 1:36 PM IST
Kurnool
X

Kurnool: పత్తికొండ నియోజకవర్గంలో వైభవంగా వరుణ యాగం, ప్రత్యేక పూజలు!

Kurnool: మండలంలోని పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

పత్తికొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని శ్రీ రంగనాథ స్వామివారిని ప్రార్థించారు.

వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సూచించారు. అధిక పెట్టుబడి అవసరమయ్యే పంటల సాగుకు వెళ్లకుండా, తక్కువ పెట్టుబడితో సాగు చేయగల స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda