Pattikonda: కూటమి సర్పంచ్ అభ్యర్థి కట్ట వేణుగోపాల్‌కు జనసేన మద్దతు!

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దేవనకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కట్ట వేణుగోపాల్‌కు జనసేన పార్టీ ఆదివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

G Jagadeesh, Pathikonda
Published on: 15 Nov 2026 4:57 PM IST
Pattikonda
X

Pattikonda: కూటమి సర్పంచ్ అభ్యర్థి కట్ట వేణుగోపాల్‌కు జనసేన మద్దతు!

దేవనకొండ: దేవనకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కట్ట వేణుగోపాల్‌కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగుతూ, కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.

కట్ట వేణుగోపాల్‌ను గెలిపించేందుకు జనసేన శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తాయని తెలిపారు. కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ అభ్యర్థి విజయానికి పూర్తి సహకారం అందిస్తామని, గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు సరోజమ్మ, కటికే ఉచ్చిరప్ప, రామాంజనేయులు, వడ్డ గోవిందు ఐటీడీపీ రామాంజి తదితరులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda