Kurnool: సుంకేసుల జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

Kurnool: కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం, గేట్ల పనితీరు, నిర్మాణ నాణ్యతను నిపుణుల కమిటీ (POE) క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

C. Ganesh, Kodumuru
Published on: 11 Oct 2026 5:59 PM IST
Kurnool
X

Kurnool: సుంకేసుల జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

కర్నూలు: కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని నిపుణుల కమిటీ (POE) సభ్యులు పరిశీలించారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం, ఆనకట్ట పరిస్థితి, గేట్ల పనితీరు, వాటి నిర్వహణ, నిర్మాణ నాణ్యతకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించారు.

ఈ కమిటీలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మాజీ ఇన్‌ఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. లక్ష్మీ రెడ్డి, మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. శ్రీకాంత్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జి. ఎల్. శివకుమార్ బాబు ఉన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru