Kodumur: గోరంట్లలో పల్లె పండుగ: ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరు

Kodumur: కర్నూలు జిల్లా గోరంట్లలో పల్లె పండుగ నిర్వహించారు. రూ.11.65 కోట్ల అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు.

C. Ganesh, Kodumuru
Published on: 3 Oct 2026 2:41 PM IST
Kodumur
X

Kodumur: గోరంట్లలో పల్లె పండుగ: ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరు

కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం రూ.11.65 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పల్లె పండుగలో భాగంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

అనంతరం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru