Kurnool: కూటమి ప్రభుత్వంతోనే ఓర్వకల్లు రూపురేఖలు మారాయి
Kurnool: ఓర్వకల్లులో రూ.4.47 కోట్ల అభివృద్ధి పనులతో రూపురేఖలు మారాయని, సర్పంచ్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కూటమికే ఉందని నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గోవింద్ రెడ్డి వెల్లడి.
Kurnool: కూటమి ప్రభుత్వంతోనే ఓర్వకల్లు రూపురేఖలు మారాయి
కర్నూలు: ఓర్పుకల్లు గ్రామ రూపురేఖలు మార్చే విధంగా విద్య, వైద్య, రవాణా, త్రాగునీరు మరియు ఆధ్యాత్మిక రంగాలలో దాదాపుగా 4.47 కోట్లకు పైగా నిధులతో చారిత్రాత్మక అభివృద్ధి పనులు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే వాటితోపాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన నిర్మాణం కోసం కోటి రూపాయలు,
మండల విద్యాశాఖ అధికారి నూతన కార్యాలయం భవన నిర్మాణం కోసం 51 లక్షలు, జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 42 లక్షలు, బాలికల హాస్టల్ లో ఆధునిక మరుగుదొడ్ల మరియు బాత్రూంలో నిర్మాణం కోసం 22 లక్షలు , అంగన్వాడి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఐదు లక్షలు,
బస్టాండ్ నుండి మర్రిచెట్టు వరకు ప్రధాన రహదారి నిర్మాణం కోసం 45 లక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓర్వకల్లు రూపురేఖలు మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో ఓటు హక్కు అడిగే ప్రధాన హక్కు కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని జిల్లా ఉపాధ్యక్షులు, గోవింద్ రెడ్డి తెలియజేశారు.




