Giddalur: గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు కాళికాంబా దేవస్థానంలో సోమవారం గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘ నూతన అధ్యక్షుడిగా నీలోజి విశ్వరూపాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 16 Nov 2026 8:08 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక!

మార్కాపురం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని వీరన్నబావి వీధి, కాళికాంబా దేవస్థానం లో ఈ రోజు మార్కాపురం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సిహెచ్ సుబ్రహ్మణ్య చారి మరియు ప్రధాన కార్యదర్శి నల్లగట్ల వీరబ్రహ్మం ,జిల్లా సంయుక్త కార్యదర్శి దేవ పూజ బ్రహ్మం ,గౌరవ సలహాదారులు లక్ష్మీనారాయణ , మరియు మునులపాటి శంకర్ ఆధ్వర్యంలో గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడమైనది.

ఈ కార్యక్రమం నందు విశ్వబ్రాహ్మణ వర్గీయులందరినీ సంప్రదించి అందరి సమ్మతితో ఏకాభిప్రాయంపై గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా నీలోజి విశ్వరూపాచారి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ప్రధాన కార్యదర్శిగా పాల్వాది నాగ వెంకట సాయి ప్రసాద్ గారిని,కోశాధికారిగా అందే విశ్వరూపాచారి గారిని ఎన్నుకోవడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సిహెచ్ సుబ్రహ్మణ్య చారి మాట్లాడుతూ గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ వర్గీయులందరినీ విస్తృతంగా సంప్రదింపులు జరిపి అందరినీ ఏకాభిప్రాయం పై తీసుకుని వచ్చి ఈ నూతన అధ్యక్షుడిని మరియు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అని తెలియచేశారు.

నూతనంగా ఎన్నికైన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నీలోజు విశ్వరూపచారి మాట్లాడుతూ గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి,అభివృద్ధికి కృషి చేస్తానని,ఎటువంటి బేధాభిప్రాయం లేకుండా అందరితో ఏకాభిప్రాయంతో సంఘాన్ని ముందుకు నడిపిస్తానని,విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రముఖ నాయకులు బంగారు పెద్ద శ్రీనివాసులు,కాయల కోటిలింగాచారి,పోలేపల్లి రాధ కృష్ణ,దొడ్డోజు రంగాచారి,మునులపాటి వీరభద్రాచారి, షరాబు దత్తాచారి,కోడూరి శేఖరాచారి,రావినూతల ఆంజనేయులు,బంగారు బాల బ్రహ్మచారి,కుల పెద్దలు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU