Nandikotkur: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 11 Nov 2026 4:46 PM IST
Nandikotkur
X

Nandikotkur: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు

నంద్యాల జిల్లా: నందికొట్కూరు పట్టణంలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్డు నందు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ మన్సూర్ అహ్మద్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను, విద్యా రంగంలో ఆయన అందించిన విశేష కృషిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అబ్దుల్ రహిమాన్, కౌన్సిలర్ లు షేక్ నాయబ్, మహబూబ్ బాష, బలుస భార్గవ తేజ, బాష, అబ్దుల్లా, పట్టణ యూత్ వింగ్ ప్రెసిడెంట్ హిదయతుల్లా ( లడ్డు),రియాజ్, ఆదామ్, మునావర్, కరిముల్లా,పాణ్యం నాగరాజు, శంకర్, బాబు, మిట్టు, సమీర్, పైల్వాన్, జయరాముడు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)