Nandyal: నంద్యాల జెడ్పీ చైర్మన్ పీఠం గుండం రమణారెడ్డికే దక్కాలి!
Nandyal: నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి కొలువుదీరుతున్న జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం గుండం వెంకట రమణారెడ్డికే దక్కాలని నందికొట్కూరు టీడీపీ నాయకులు ఆకాంక్షిస్తున్నారు.
Nandyal: నంద్యాల జెడ్పీ చైర్మన్ పీఠం గుండం రమణారెడ్డికే దక్కాలి!
నంద్యాల: నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి సొంతంగా జిల్లా పరిషత్ ఏర్పడింది. 28 మండలాలకు ప్రతినిధిగా ఉండే ఈ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం. ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్న పేరు గుండం వెంకట రమణారెడ్డి.
మూడు దశాబ్దాల నిఖార్సయిన పసుపు జెండా మోసిన నాయకుడు,
రమణారెడ్డి నిన్నగాక మొన్న వచ్చిన నాయకుడు కాదు. దాదాపు 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జెండా దించకుండా పని చేసిన వ్యక్తి. ఆయన తండ్రి గుండం రంగారెడ్డి 1970 నుండి 1980 వరకు ఏకధాటిగా జలకనూరు సర్పంచ్ గా చేసి, గ్రామానికి సేవ చేశారు. ఆ వారసత్వం నుండే రమణారెడ్డి వచ్చారు.
ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం.
వెలుగోడు జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ప్రత్యర్థి పార్టీలు సైతం ఆయనకు పోటీగా నిలబడలేకపోయాయి. ఇది ఆయనకు ప్రజల్లో ఉన్న పలుకుబడిని, అన్ని వర్గాల్లో ఉన్న ఆమోదాన్ని తెలియజేస్తుంది. 24 వేల మెజారిటీలు ముఖ్యమే కానీ, ఏకగ్రీవం అనేది అంతకుమించిన గౌరవం.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు పదవికి సైతం వన్నెతెచ్చిన నాయకుడు. నందికొట్కూరు,ఆత్మకూరు, పాణ్యం ఎమ్మెల్యేల మద్దతు మరియు మంత్రులు సైతం అనుకూలంగా ఉండటం ఈయనను జెడ్పీ చైర్మన్ రేసులో ముందుండేలా చేసింది.
మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టమైన సంకేతాలు రావడం, జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు - గౌరు చరితా రెడ్డి, గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో సహా మరో ఇద్దరు, అలాగే మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ మద్దతు రమణారెడ్డికే ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక జెడ్పీ చైర్మన్ కు కావాల్సింది ఇదే - అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లే మనస్తత్వం.
ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఎన్.ఎం.డి. ఫరూక్, బనగానపల్లెకు బీసీ జనార్దన్ రెడ్డి రూపంలో మంత్రి పదవులు ఉన్నాయి. పత్తికొండ, నందికొట్కూరు, డోన్ లాంటి నియోజకవర్గాలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు. నందికొట్కూరు నియోజకవర్గం, మిడుతూరు మండలానికి చెందిన రమణారెడ్డికి ఇస్తే, జిల్లా మొత్తానికి సమన్యాయం చేసినట్టు అవుతుంది.
ఇంటర్ వరకు చదువుకున్న రమణారెడ్డి, దూకుడు రాజకీయాలు చేయని, అందరితో సఖ్యంగా ఉండే నాయకుడిగా పేరు ఉంది. జెడ్పీ చైర్మన్ అంటే 28 మంది జెడ్పీటీసీలను, వందలాది ఎంపీటీసీలు, సర్పంచ్ లను కలుపుకొని వెళ్లాలి. ఆ సామర్థ్యం రమణారెడ్డికి ఉంది.
కాబట్టి, కూటమి ప్రభుత్వం పార్టీకి కష్టపడిన కార్యకర్తను గుర్తించాలంటే, అనుభవానికి, ఏకగ్రీవానికి, అందరి ఆమోదానికి విలువ ఇవ్వాలంటే - నంద్యాల జెడ్పీ చైర్మన్ పీఠం గుండం రమణారెడ్డికే దక్కాలి,అనేది నందికొట్కూరు టీడీపీ నాయకుల ఆకాంక్ష.
ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే పదవి కాదు, మూడు దశాబ్దాలుగా జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ఇచ్చే గౌరవం. మొత్తం మీద ఈ ఉత్కంఠకు తెరదించి సమర్థవంతమైన నాయకుడికే దక్కేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని నంద్యాల జిల్లా టీడీపీ నాయకులు కోరుకుంటున్నారు.




