Nandyal: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

Nandyal: నంద్యాల జిల్లాలో పరిషత్ ఓట్ల లెక్కింపునకు 5 ప్రాంతాల్లో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ వెల్లడి. ఉదయం 7 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం.

R Pavankalyan, Nandyal
Published on: 6 Nov 2026 7:51 PM IST
Nandyal
X

Nandyal: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

నంద్యాల: నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జడ్పీ సీఈఓ శివశంకర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

జిల్లాలోని 20 జడ్పీటీసీ స్థానాలకు 57 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ ఎన్నికల్లో 5 లక్షల 6 వేల 370 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు.

అదేవిధంగా జిల్లాలోని 377 ఎంపీటీసీ స్థానాల్లో 224 స్థానాలకు ఎన్నికలు జరిగాయని, ఈ స్థానాల్లో 574 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో 5 లక్షల 11 వేల 137 మంది ఓట్లు వేసినట్లు వెల్లడించారు.

జిల్లావ్యాప్తంగా నంద్యాలలో రెండు కేంద్రాలతో పాటు ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నంద్యాల పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సిరివెళ్ల, బండి ఆత్మకూరు మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నంద్యాల, గడివేముల, పాణ్యం, గోస్పాడు మండలాల ఓట్లను లెక్కించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహానంది మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటలలోపు ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నామని జడ్పీ సీఈఓ శివశంకర్ తెలిపారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal