Nandyal: జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
Nandyal: అవుకు మండలం రామాపురంలో జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో పడి ముగ్గురు గల్లంతు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
Nandyal: జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
నంద్యాల: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో తీవ్ర విషాదం. జీఎన్‌ఎస్‌ఎస్ (GNSS) కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు. సరదాగా కాలువ వద్దకు వెళ్లిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు.. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డ 6 ఏళ్ల బాలుడు.
కొడుకును రక్షించేందుకు కాలువలోకి దూకిన తండ్రి, ఇద్దరు బావమరుదులు, నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో కొట్టుకుపోయిన తండ్రి అఫ్రోజ్, కుమారుడు ఆరిష్(6), బావమరిది ఆసిఫ్, బాధితుల స్వస్థలం బేతంచెర్ల.. రామాపురం నాపరాతి ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు గుర్తింపు.
గాలేరు నగరి కాలువ లో కొట్టుకుపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. కడప జిల్లాకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో తీవ్రంగా ఉన్న ప్రవాహ వేగం.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న బనగానపల్లె సీఐ మంజునాథ రెడ్డి. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సహాయం కోరినట్లు తెలిపిన సీఐ మంజునాథ్ రెడ్డి. నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినట్లు తెలిపిన సీఐ మంజునాథ రెడ్డి...




