Nandyal: 50 ఏళ్ల తర్వాత తొలిసారి సున్నిపెంట పంచాయతీ ఎన్నికలు!

Nandyal: సుమారు 50 ఏళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్న నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి 5 నామినేషన్లు రాగా, వట్టి వెంకటరెడ్డి ఏకగ్రీవం కానున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 21 Nov 2026 10:19 AM IST
Nandyal
X

Nandyal: 50 ఏళ్ల తర్వాత తొలిసారి సున్నిపెంట పంచాయతీ ఎన్నికలు!

నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది సర్పంచ్ అబ్యర్ది అభ్యర్థిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సుమారు 50 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా సున్నిపెంటలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో, నియోజకవర్గం మొత్తం ఇదే విషయంపై ఆసక్తిగా చూస్తోంది.

నవంబర్ 18 నుంచి 20 వరకు జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. సున్నిపెంట సర్పంచ్ బరిలో నిలిచేందుకు మొత్తం 5 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు వచ్చాయి. అయితే, సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేసిన 5 కూడా టీడీపీ మద్దతుదారులే కావడంతో, సున్నిపెంట పంచాయతీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దశాబ్దాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే ఏకగ్రీవం దిశగా అడుగులు పడుతుండటంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే స్దానిక కూటమి నాయకుడు వట్టి వెంకటరెడ్డిని సర్పంచ్ గా ఎకగ్రివం చేసుకునేందుకు కూటమి నేతలు డిసైడ్ చేయడంతో సున్నిపెంట గ్రామపంచాయతి పరిధిలోని నాయకులు కార్యకర్తలు స్దానికులు హర్షం వ్యక్తం చేశారు సున్నిపెంట గ్రామ పంచాయతీ అభివృద్ధికై కృషి చేసే విందంగా అడుగులు ముందుకు పడన్నట్లు కార్యకర్తలలో ఆనందం వ్యక్తం అవుతుంది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM