Srisailam: శిఖరం ఫారెస్ట్ చెక్పోస్ట్ వాహన నిబంధనల పోస్టర్ల ఆవిష్కరణ!
Srisailam: శ్రీశైలం ఈవో కార్యాలయంలో శిఖరం ఫారెస్ట్ చెక్పోస్ట్ వాహన రాకపోకల సమయ నిబంధనల అవగాహన పోస్టర్లను ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట శ్రీకాంత్ ఆవిష్కరించారు.
Srisailam: శిఖరం ఫారెస్ట్ చెక్పోస్ట్ వాహన నిబంధనల పోస్టర్ల ఆవిష్కరణ!
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో ఎం శ్రీనివాసరావు కార్యాలయంలో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలోని శిఖరం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న వాహనాల రాకపోకల సమయ నిబంధనలకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆత్మకూర్ ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈకార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవోఎం శ్రీనివాసరావు శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం.పరమేశులు ఏఈవో వెంకటేశ్వరరావు ఏఈవో సాములు మరియు ఇతర అధికారులుపోస్టర్లలో పేర్కొన్న ప్రధాన వాహన రాకపోకల నిబంధనలుభారీ రవాణా వాహనాలు (Heavy Goods Vehicles): సాయంత్రం 6:00 గంటల తర్వాత అటవీ మార్గంలోకి అనుమతించబడవు తేలికపాటి వాహనాలు (Light Vehicles): రాత్రి 9:00 గంటల వరకు మాత్రమే అటవీ మార్గంలో ప్రయాణించడానికి అనుమతి ఉంటుందిపూర్తి నిషేధం (No Entry): రాత్రి 9:00 గంటల తర్వాత శిఖరం ఫారెస్ట్ చెక్పోస్ట్ మీదుగా NSTR అటవీ ప్రాంతంలోకి ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతించబడదు.
ఈసందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. పరమేశులు మాట్లాడుతూ, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ ప్రాంతం పులులు, చిరుతలు, జింకలు తదితర వన్యప్రాణులకు సహజ ఆవాసమని, రాత్రి వేళల్లో వన్యప్రాణులు ఆహార అన్వేషణ, సంచారం మరియు నీటి అవసరాల కోసం అటవీ మార్గాలను దాటుతుంటాయని తెలిపారు.
ఈ సమయంలో వాహనాల రాకపోకల వల్ల వన్యప్రాణులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటమే కాకుండా, వాహనాల ఢీకొనడం వల్ల వన్యప్రాణుల మృతికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారుఅటవీ మార్గాల్లో వాహనాల రాకపోకలను నిర్దేశిత సమయాలకు పరిమితం చేయడం ద్వారా వన్యప్రాణుల స్వేచ్ఛాయుత సంచారానికి, వాటి సహజ ఆవాసాల పరిరక్షణకు మరియు ప్రయాణీకులభద్రతకుదోహదపడుతుందని తెలిపారు.
కావున శ్రీశైలం వచ్చే భక్తులు, పర్యాటకులు మరియు వాహనదారులు శిఖరం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న సమయ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, రాత్రి వేళల్లో అటవీ మార్గాల్లో ప్రయాణించకుండా అటవీ శాఖకు సహకరించాలని తెలిపారు.




