Nandyal: నంద్యాల జడ్పీ చైర్మన్ రేసులో ఆళ్లగడ్డ జడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి

Nandyal: నంద్యాల జడ్పీ చైర్మన్ పదవికి ఆళ్లగడ్డ జడ్పీటీసీ పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి రేసు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి మద్దతు కోరిన నేత.

Ramanaiah, Banaganepalle
Published on: 9 Nov 2026 8:09 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల జడ్పీ చైర్మన్ రేసులో ఆళ్లగడ్డ జడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి

నంద్యాల: నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఆళ్లగడ్డ జడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, జడ్పీ చైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 28 మంది జడ్పీటీసీలు ఉన్నారని, వారిలో తాను కూడా ఒకడినని, చైర్మన్ పదవిని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.

మంత్రితో పోరెడ్డి భేటీ కావడంతో జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle