Nandikotkur: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
Nandikotkur: జూపాడు బంగ్లా, కొత్తపల్లి మండలాల్లో రూ.25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్ పనులను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు.
Nandikotkur: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా: నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామం, కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. తరిగోపుల గ్రామంలో రెండు సిమెంట్ రోడ్లు, రెండు రక్షణ గోడలు రూ. 20 లక్షలతో పూర్తి చేసిన పనులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.
తరిగోపుల గ్రామానికి మినరల్ వాటర్ ఫ్లాంట్, అదనంగా సిమెంట్ రోడ్లు కూడా కొత్తగా మంజూరు చేస్తున్నట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గ్రామస్థులకు హామీ ఇచ్చారు. తరిగోపులలో మాజీ జడ్పీటీసీ, టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వరావు, పి ఆర్ డి ఈ సుధాకర్ బాబు, ఏ ఈ బసిర్, ఎంపీడీఓ గోపినాథ్, తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ వెంకటరమణ, పారుమంచాల కరుణాకర్ రెడ్డి, శివ చంద్రుడు, బాలస్వామి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
అలాగే కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామంలో ఎంపీ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్ ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు అందుంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మండల కేంద్రం కొత్తపల్లి గ్రామంలోని పురాతన తాండవ మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా నిధుల విడుదలకు కృషి చేస్తానని, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో తాండవ మల్లేశ్వర స్వామి ఆలయ జీర్నోద్దారణ పనులకు అన్ని విధాలుగా సహకరిస్తానని గ్రామ పెద్దలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎంపీడీఓ మేరి, డిప్యూటీ తహసీల్దార్ అరుణ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ జుబేర్, ఎం. లింగాపురం చిన్న. పుల్లారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లయ్ డైరెక్టర్ మహేష్ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, నరాల శ్రీనాథ్ రెడ్డి, శివారెడ్డి, రామచంద్రారెడ్డి, మినరల్ వాటర్ కాంట్రాక్టర్ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




