Nandyal: పాత ముచ్చుమర్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ

Nandyal: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాత ముచ్చుమర్రిలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 3 Oct 2026 4:19 PM IST
Nandyal
X

Nandyal: పాత ముచ్చుమర్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ

నంద్యాల: నంద్యాల పార్లమెంట్ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ దళిత కాలనీ ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించడమే లక్ష్యం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామ బస్టాండ్ సెంటర్ లో నంద్యాల ఎంపీ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్ ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎంపీ నిధులతో గ్రామాల్లో, ముఖ్యంగా దళిత, బడుగు బలహీన వర్గాల కాలనీలలో మినరల్ వాటర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. మినరల్ వాటర్ ఫ్లాంట్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ముచ్చుమర్రి టీడీపీ సీనియర్ నాయకులు కాటం. వెంకటరామిరెడ్డి, రాఘవరెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు కుమ్మరి. నాగరాజు, సుబ్బారావు, బాలనారాయణ, నాగేశ్వరావు, చిన్న సుంకన్న, రాముడు, మాజీ మున్సిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్. కాకరవాడ. చిన్న వెంకటస్వామి, కట్టుబడి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)