Banaganapalle: భర్త రాష్ట్ర మంత్రి.. భార్య బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి, 20 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Banaganapalle: భర్త రాష్ట్ర మంత్రి.. భార్య బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్
బనగానపల్లె: నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భర్త రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, భార్యబనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఆర్ అండ్ బీ, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
రెండో విడతలో భాగంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఇందిరా రెడ్డి ఒక్కరే బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం బీసీ ఇందిరా రెడ్డి, 20 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మంత్రి సతీమణి అయినప్పటికీ, బనగానపల్లె ప్రజలతో ఉన్న అనుబంధంతో సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించారు. రాజకీయాల్లో తన తొలి అడుగులను సర్పంచ్ పదవితో ప్రారంభించారు. దీంతో ఒకే కుటుంబం నుంచి భర్త రాష్ట్ర మంత్రిగా, భార్య బనగానపల్లె పంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.




