Nandyal: నంద్యాల జిల్లాలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు!
Nandyal: నంద్యాల జిల్లా అవుకు మండలం వేములపాడులో రూ.25 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
Nandyal: నంద్యాల జిల్లాలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు!
Nandyal: అవుకు మండలం వేములపాడు గ్రామం లో రూ.25.00 లక్షలతో పూర్తిచేసిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. నాణ్యమైన రహదారుల నిర్మాణంతో గ్రామంలోని అంతర్గత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యంతో పాటు, సైడ్ డ్రెయిన్ల ఏర్పాటుతో వర్షపు నీరు, మురుగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తుందనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను దశలవారీగా బలోపేతం చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
వేములపాడు గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తీసుకువస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.




